సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచంలో మానవులు నివసించే అత్యంత శీతల ప్రాంతం రష్యాకు సమీపంలోని సైబీరియా. అక్కడి ఉష్ణాగ్రతల గురించి తెలుసుకుంటేనే మనకు నిలువెల్లా వణకు పుట్టాల్సిందే! శీతల కాలంలో మైనస్ డిగ్రీలకు పడిపోయే అతి శీతల ప్రాంతాల్లో మానవులు ఆ కొద్దికాలం చలిని తట్టుకోవాలంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. అదే ఎప్పుడూ మైనస్ డిగ్రీల సెల్సియెస్ అంటే, మైనస్ ఐదు నుంచి మైనస్ 60 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉండే సైబీరియా ప్రాంతంలో నివసించాలంటే నిత్య పోరాటమే. కానీ అది అక్కడి స్థానికులకు అంతగా వర్తించదు.
గడ్డకట్టే చలిలో స్నానమంటే...